2025 జూలైలో 24వ తానా సమావేశాలు - వాలంటీర్ అవ్వండి! చేయి చేయి కలపండి!!

ప్రియమైన తెలుగు మిత్రులారా,

2005, 2015 సమవేశాలకు ఆతిధ్యాన్నిచ్చిన డిట్రాయిట్ పరిసర ప్రాంత తెలుగు ప్రజల సామర్ధ్యాన్ని గుర్తించి, 2025 జూలైలో Novi Suburban Showplace లో 24వ సమావేశాలు జరపాలని తానా నిర్ణయించిందన్న విషయం మీతో పంచుకోవటం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇది మన నగరానికి ఎంతో గర్వకారణం. మన సమిష్టి కృషికి, సమైక్యతకు నిదర్శనం.

దాదాపు రెండున్నర రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు పదివేలకు మించి తెలుగు వారు పాల్గొననున్నారు. ఈ సమావేశాలు విజయవంతం చేయడంలో మీ అందరి భాగస్వామ్యం ముఖ్యం. ఇందుకోసం షుమారు 60 కమిటీలు ఏర్పాటు చేశాము. మీ ప్రతిభ, ఆసక్తి ఆధారంగా మీరు వివిధ కమిటీల్లో వాలంటీర్గా చేరాలని సవినయంగా కోరుతున్నాము. ఈ లింక్ ద్వారా మీ పేరు నమోదు చేయండి: Click Here

డిట్రాయిట్ తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచపటంపై నిలిపే ఈ కార్యక్రమంలో మనమందరం కలసికట్టుగా పాల్గొనదాం! తెలుగు వారికి ఓ మధురమైన సమావేశాన్ని అందిద్దాం !!

TANA కాన్ఫరెన్స్ అప్డేట్స్ కోసం ఈ వాట్సాప్ కమ్యూనిటీలో చేరండి:

https://chat.whatsapp.com/Jzp6wUVqBeKDUwdswC5itY

మీ మద్దతుకు ముందస్తు కృతజ్ఞతలు.